అదే పెద్దపులి మళ్లీ వచ్చింది.. పోలవరం ప్రాజెక్టు వద్ద భయాందోళనలో ప్రజలు
- పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారం కలకలం
- రెండు దూడలపై దాడి చేసి చంపడంతో తీవ్ర భయాందోళన
- గతంలో పట్టుకుని పాపికొండల్లో వదిలిన పులేనని నిర్ధారణ
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరిక
- పులిని బంధించేందుకు రంగంలోకి ప్రత్యేక నిపుణుల బృందాలు
ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు సమీపంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రాజెక్టు పరిధిలోని దేవరగొండి జంట టన్నెళ్ల వద్ద పులి తిరుగుతుండటంతో స్థానిక గ్రామ ప్రజలు, ప్రాజెక్టు సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. రెండు దూడలను చంపేయడంతో ఈ భయం మరింత పెరిగింది. అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి పులిని బంధించేందుకు చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే, శనివారం రాత్రి పోలవరం ప్రాజెక్టు పాత దేవరగుండి టన్నెల్ వద్ద ఉన్న రెగ్యులేటర్ సమీపంలో స్థానికులు పులిని గమనించారు. అక్కడే ఉన్న రెండు దూడలపై అది దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆదివారం ఉదయం ముంపు గ్రామమైన దేవరగొండిలోని జంట టన్నెళ్ల వద్ద కూడా పులి కదలికలను అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ప్రాజెక్టు ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు, స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గతంలో పట్టుబడి, మళ్లీ ప్రత్యక్షం
ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోకి ప్రవేశించిన ఈ పులి, అప్పట్లో బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లోనూ సంచరించి కలకలం రేపింది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా అడవుల్లోకి వెళ్లింది. రాయవరం సమీపంలో దీని సంచారం ఎక్కువ కావడంతో, పుణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఫిబ్రవరిలో దీనిని సురక్షితంగా పట్టుకుంది.
అనంతరం పులిని విశాఖపట్నం జూకు తరలించి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆధునిక కాలర్ ఐడీని అమర్చారు. పోలవరం ప్రాంతంలోని పాపికొండల అభయారణ్యంలో దానిని తిరిగి వదిలిపెట్టారు. అయితే, అది అభయారణ్యానికే పరిమితం కాలేదు. ఏప్రిల్ 14న గోదావరి నదిని దాటి కొట్టూరు ముంపు గ్రామంలోకి ప్రవేశించి, అప్పటి నుంచి ఏలూరు, పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల మధ్య సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.