ఏపీ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్
- ఫిబ్రవరి 5 నుంచి బడ్జెట్ సమావేశాలు
- మూడు నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం
- ప్రస్తుతం ప్రవేశ పెట్టేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఎన్నికలు జరిగే సంవత్సరంలో ప్రవేశపెడతారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఖర్చుల కోసం అవసరమైన నిధులను కాన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకుంటారు. దీనికి ఆమోదం తెలపడం కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్స్ నిర్వహిస్తారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. టీడీపీ, జనసేనలు పొత్తులో బరిలోకి దిగబోతున్నాయి. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు సింగిల్ గా పోటీ చేయబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచార రంగంలోకి దూకాయి.