ఏపీలో కొత్త IASల పోస్టింగ్‌లకు బ్రేక్.. గంటల వ్యవధిలోనే ఉత్తర్వులు వెనక్కి
- 2024 బ్యాచ్‌కు చెందిన ఏడుగురు అధికారుల నియామకాలు హోల్డ్
- ఒక బదిలీ సహా అన్ని నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు
- మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసి, బుధవారం ఉదయానికే నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన ఏడుగురు ఐఏఎస్ అధికారులకు సబ్-కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. మంగళవారం రాత్రి జారీ అయిన ఈ ఆదేశాలను బుధవారం ఉదయానికల్లా హోల్డ్‌లో పెడుతూ ప్రభుత్వం తిరిగి ఉత్తర్వులు ఇవ్వడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ మంగళవారం రాత్రి 2024 బ్యాచ్‌కు చెందిన ఏడుగురు ఐఏఎస్ అధికారులను వివిధ సబ్-డివిజన్లకు సబ్-కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం సందీప్ రఘువంశీ (తెనాలి), కె. చిరంజీవి నాగవెంకట సహిత (పాడేరు), డి. పృథ్వీ రాజ్ కుమార్ (రంపచోడవరం), చిట్టిపులి నరేంద్ర పాడల్ (చింతూరు), సచిన్ రహర్ (పార్వతీపురం), ఫరీజ్ జహీద్ (పెనుకొండ), మనీషా (నంద్యాల)లకు పోస్టింగ్‌లు ఖరారు చేశారు.
అదేవిధంగా, 2023 బ్యాచ్‌కు చెందిన అధికారి, అప్పటి చింతూరు సబ్-కలెక్టర్ శుభమ్ నోఖ్వాల్‌ను రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఈ సబ్-డివిజన్లలో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్లు, డీఆర్ఓలు వెంటనే సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) రిపోర్ట్ చేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే, ఈ ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం వాటిని నిలిపివేసింది. బుధవారం ఉదయం ఈ నియామకాలు, బదిలీలన్నింటినీ హోల్డ్‌లో పెడుతున్నట్లు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆకస్మిక నిర్ణయానికి గల కారణాలు మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు.