కోదండరాం, అమీర్ ఆలీఖాన్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్!
- కోదండరాం, అమీర్ అలీఖాన్ ల నియామకాన్ని హైకోర్టులో సవాల్ చేసిన బీఆర్ఎస్ నేతలు
- తమ పిటిషన్ తేలేవరకు ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి
- యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు
అయితే వీరి నియామకాలను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. గత ఎమ్మెల్సీ అంశం తేలే వరకు వారి ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా... నిబంధనల ప్రకారం లేదని గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఓకే చేశారు. అయితే తమను తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో వారు ప్రమాణానికి సిద్ధమవుతుండగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.