సంక్రాంతికి ఊరెళతాను... రక్షణ కల్పించండి: హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్
- పోలీసులు ఇప్పటికే తనపై 11 కేసులు పెట్టారని.. మరో కేసు పెట్టే అవకాశముందని కోర్టుకు తెలిపిన రఘురామ
- గతంలో సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణ
- రఘురామ తరఫున న్యాయవాదులు ఉమేశ్ చంద్ర, వై.వి.రవిప్రసాద్ పిటిషన్
గతంలో సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసి... చిత్రహింసలకు గురి చేశారని రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనపై తప్పుడు కేసులు పెట్టి మరోసారి అరెస్ట్ చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.