టీడీపీ-జనసేన 'రా కదలిరా' ప్రత్యేక గీతం విడుదల
- ఏపీలో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన
- ఇప్పటికే రా కదలి రా సభలు
- తాజాగా ప్రత్యేక గీతం రూపకల్పన
"నినదించర గళం విప్పి, నిలదీయర గల్ల పట్టి... నిలవాలిర పిడికిలెత్తి... తెలుగుదేశ సైనికా...!
ప్రతి అడుగొక పిడుగులాగ... గెలుపు మోకరిల్లే దాక... ప్రతినబూని కదలి రారా... జనసేన సేవకా...!
అభివృద్ధికి అర్థమైన దార్శనికుని (చంద్రబాబు) స్ఫూర్తిగా...
రాష్ట్ర ప్రగతే ముఖ్యమన్న పవనన్నకి అండగా...
ఉడుకెత్తిన నెత్తురే ఒకనిప్పుటేరు (లోకేశ్) లాగ...
కదిలిరా... కదలిరా... కదలిరా...
పిలుస్తోంది పిలుస్తోంది తెలుగుదేశం రారా
పదం కలిపి నడుస్తోన్న జనసేనతో రారా..." అంటూ ఈ గీతం సాగుతుంది.