తెరపై పెరుగుతున్న తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్!
- తండ్రీ కూతుళ్ల చుట్టూ తిరుగుతున్న కథలు
- ఆడియన్స్ ఆదరణ పొందుతున్న కంటెంట్
- రీసెంటుగా హిట్ కొట్టిన 'హాయ్ నాన్న'
- ఈ నెల 13న విడుదలవుతున్న 'సైంధవ్'
- తెలుగు తెరకి పరిచయమవుతున్న చైల్డ్ ఆర్టిస్టులు
సిద్ధార్థ్ హీరోగా చేసిన 'చిన్నా' సినిమాలో అతను బాబాయ్ అయినప్పటికీ, తండ్రి స్థానంలోనే కనిపిస్తాడు. తమిళంలో ఆ సినిమా భారీ విజయాన్ని సాధించగా, తెలుగులోను మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక రీసెంటుగా వచ్చిన 'హాయ్ నాన్న' సినిమా కూడా తండ్రీకూతుళ్ల నేపథ్యంలో వచ్చిన కథనే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను మంచి లాభాలను సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు వెంకటేశ్ హీరోగా చేసిన 'సైంధవ్' కూడా ఫాదర్ - డాటర్ మధ్య సాగే ఎమోషనల్ డ్రామానే. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో వెంకటేశ్ కూతురుగా బేబీ 'సారా పాలేకర్' నటించింది. ఈ సినిమాలో ఆ పాపనే హీరో అని వెంకటేశ్ చెప్పడం గమనించవలసిన విషయం. మొత్తానికి ఈ తరహా కాన్సెప్టుల వలన తెలుగు తెరపై మళ్లీ చైల్డ్ ఆర్టిస్టులు కనిపిస్తుండటం శుభపరిణామం.