విజయకాంత్‌ సమాధి వద్ద కన్నీరు పెట్టుకున్న సూర్య

Suriya burts into tears
  • విదేశాల నుంచి తిరిగొచ్చిన సూర్య
  • విజయకాంత్ సమాధి వద్ద నివాళి  
  • ఆయన మరణం షాక్ కు గురి చేసిందని ఆవేదన
కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ కు స్టార్ హీరో సూర్య నివాళి అర్పించారు. విజయకాంత్ మృతి చెందినప్పుడు షూటింగ్ కారణంగా సూర్య విదేశాల్లో ఉన్నారు. నిన్న ఆయన చెన్నైకు తిరిగొచ్చారు. ఈరోజు విజయకాంత్ సమాధి వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కెప్టెన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. 

విజయకాంత్ మరణం తనను షాక్ కు గురి చేసిందని చెప్పారు. కెరీర్ ఆరంభంలో నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ తనకు గుర్తింపు రాలేదని... ఆ సమయంలో 'పెరియన్నా' సినిమాలో విజయకాంత్ తో కలిసి పని చేశానని తెలిపారు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేయాలని ఆయన తనను ప్రోత్సహించేవారని చెప్పారు. అందరితో ఎంతో మంచిగా మాట్లాడేవారని అన్నారు. ఆయన మరణం చిత్ర సీమకు తీరని లోటు అని చెప్పారు. 
Go Back to Shorts
Suriya
Kollywood
Tollywood
Vijayakanth

More Telugu News