అయ్యప్పలకు టీఎస్ఆర్టీసీ శుభవార్త... శబరిమలకు ప్రత్యేక బస్సు
- జనవరి 5వ తేదీ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం
- టిక్కెట్ ధర రూ.13,600గా నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ
- కాణిపాకం, గురువాయూర్, ఎరుమెళి, తిరువనంతపురం, పంబ, మహానంది, అరుణాచలం, కంచి క్షేత్రాల దర్శనం
మొదటి రోజు సాయంత్రం 3 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు బయలుదేరుతుంది.
రెండో రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు కాణిపాకం చేరుకొని.. తిరిగి రాత్రి 10.40 గంటలకు బయలుదేరుతుంది.
మూడో రోజు ఉదయం 6.30 గంటలకు గురువాయూర్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.
నాలుగో రోజు రాత్రి 11.20 గంటలకు ఎరుమలై చేరుకొని.. తిరిగి మరుసటి రోజు ఉదయం 8.20కి బయలుదేరుతుంది.
ఉదయం 9.20 గంటలకు పంబకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు బస్సు తిరిగి బయలుదేరుతుంది.
ఐదో రోజున ఉదయం 5.20 గంటలకు తిరువనంతపురం చేరుకొని... ఉదయం గం.9.20 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.
ఆరో రోజున ఉదయం ఏడున్నర గంటలకు అరుణాచలం చేరుకొని... తిరిగి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది.
అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు మధురై చేరుకుంటుంది. తిరిగి రాత్రి 11.20 గంటలకు బయలుదేరుతుంది.
ఆ తర్వాత కంచికి వెళ్తుంది.
ఏడో రోజున ఉదయం 11.10 గంటలకు మహానంది చేరుకుంటుంది. రాత్రి 11.30కి తిరిగి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది.