28వ తేదీ నుంచి తెలంగాణలో 'ప్రజాపాలన'... అధికారులతో దానకిశోర్ సమీక్ష సమావేశం
- ప్రజాపాలన, వార్డు సభల కోసం బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన
- దరఖాస్తుల స్వీకరణ.. రసీదులు ఇవ్వడం డిజిటలైజ్ చేయాలని సూచన
- వార్డు సభల తేదీలను ప్రజల్లోకి వెళ్లే విధంగా చూడాలని ఆదేశం
ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ... రసీదులు ఇవ్వడం... ఆ అంశాలను డిజిటలైజ్ చేయడం వంటివి ఉంటాయని, వాటికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డు సభల తేదీలు ప్రజల్లోకి వెళ్లే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యమయ్యేలా చూడాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంపై రోజువారీ నివేదికను రాష్ట్ర కార్యాలయానికి పంపించాలన్నారు.