ఆటో డ్రైవర్లు అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam Prabhakar in Prajavani
  • ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నార్న పొన్నం ప్రభాకర్
  • ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
  • ఆటో వాళ్ళు తమ సోదరులేనని వ్యాఖ్య  
ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాభవన్‌లో ఈరోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని అన్నారు. ఈ రోజు 5126 దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో చాలామంది సొంత ఇల్లు లేదని వచ్చినట్లు వెల్లడించారు. నిరుద్యోగులూ ఎక్కువ సంఖ్యలో వచ్చారన్నారు. వాళ్ల సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. 

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని.. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆటో వాళ్ళు మా సోదరులేనని, వాళ్ళకు కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని సూచించారు.
Advertisement
Ponnam Prabhakar
Congress
auto
Telangana

More Telugu News