కల్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి... ట్వీట్ చేసిన రాములమ్మ

VijayaShanti tweets about Nandamuri Kalyan Ram
  • తనను ప్రాణంగా భావిస్తూ నా వెన్నంటి వున్న అభిమాన దైవాలకు అంటూ ట్వీట్
  • మీ అభిమానం కోసం మళ్లీ ఓ సినిమా చేస్తున్నానని వెల్లడి
  • కల్యాణ్ రామ్, దర్శక నిర్మాతలకు విజయశాంతి శుభాకాంక్షలు
మూడేళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి రాజకీయాల్లోను చురుగ్గా ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఆమె నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ఓ సినిమాలో నటిస్తున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. దీంతో ఆమె కల్యాణ్ రామ్ చిత్రంలో నటిస్తున్నట్లుగా తేలింది.

'నన్ను తమ ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెన్నంటి ఉంటూనే ఉన్న నా అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో... మీ కోసం.....  నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం, మళ్లీ ఒక సినిమా చేస్తున్నాను...
5 దశాబ్ధాల ఈ నా సినీ గమనంలో మీ దీవెనలు ఎన్నటికీ , 1979 నుండి నేటి వరకు ఉన్నట్లు మీ విజయశాంతి కళాకారిణిగా ఉన్నంత వరకు ఎప్పటికీ అట్లనే ఉంటాయని  విశ్వసిస్తూ.... నందమూరి కల్యాణ్ రామ్, దర్శకుడు ప్రదీప్ చార్ల, నిర్మాత సినిల్ బలుసు మరియు టీమ్‌కు బెస్ట్ విషెస్' అంటూ ట్వీట్ చేశారు.
Advertisement
Vijayashanti
Congress
kalyan ram

More Telugu News