తెలంగాణలో త్వరలో బీజేపీ ప్రభుత్వం: రాజాసింగ్
- కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులే పాలిస్తుందన్న బీజేపీ నేత
- కేసీఆర్ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్ చేతులెత్తేస్తుందని వ్యాఖ్య
- దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేసీఆర్ పై ఫైర్
బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్దంతి కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ప్రజలు సీఎంనే మార్చేశారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.