Ram Gopal Varma: నో డౌట్.. రేవంత్ రెడ్డి ఆల్ టైమ్ బెస్ట్ సీఎం అవుతారు: రామ్ గోపాల్ వర్మ

REVANTH REDDY will be the BEST CHIEF MINISTER of ALL TIME says Ram Gopal Varma
  • రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన రామ్ గోపాల్ వర్మ
  • ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తి అని కితాబు
  • పదునైన ఆలోచనలు కలిగిన నాయకుడని ప్రశంస
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించబోతున్న రేవంత్ రెడ్డిపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఎంతో జ్ఞానం ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేశారని ఆయన అన్నారు. రేవంత్ గురించి, ఆయన శక్తి గురించి, ఆయన ఆలోచనల్లో పదును గురించి తెలిసిన వ్యక్తిగా చెపుతున్నా... ఆల్ టైమ్ బెస్ట్ సీఎంగా రేవంత్ అవుతారని చెప్పడంలో తనకు ఎలాంటి సందేహం లేదని అన్నారు. నో డౌట్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు సీఎంగా రేవంత్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ పార్టీ పెద్దలను కలుస్తూ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.
Ram Gopal Varma
Tollywood
Revanth Reddy
Congress

More Telugu News