'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'మా ఊరి పొలిమేర 2'
- నవంబర్ 3న విడుదలైన 'మా ఊరి పొలిమేర 2'
- సక్సెస్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇది
- ప్రధానమైన పాత్రలలో సత్యం రాజేశ్ - కామాక్షి భాస్కర్ల
- ఈ నెల 8వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'మా ఊరిపొలిమేర 2' నవంబర్ 3వ తేదీన విడుదలైంది. ఫస్టు పార్టు ఓటీటీలో రిలీజ్ కాగా, సెకండు పార్టు థియేటర్స్ కి రావడం విశేషం. గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. 'సత్యం' రాజేశ్ .. కామాక్షి భాస్కర్ల .. బాలాదిత్య ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆ సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.
సాధారణంగా కొన్ని గ్రామాల్లో క్షుద్ర శక్తులు .. క్షుద్ర పూజలు .. నిధిని గురించిన ప్రచారాలు .. బలి అంటూ జరిగే హడావిడి .. ఎవరిపై అయితే అనుమానం వచ్చిందో, వాళ్లు ఊరొదిలి పారిపోవడం గురించిన వార్తలు పేపర్లో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనలలో నుంచి పుట్టుకొచ్చిన కథనే ఇది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.