రాజమౌళి వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందన

Ram Gopal Varma response on Rajamouli comments
  • ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్లలో వర్మ ఒకరన్న రాజమౌళి
  • సినిమాను ఇలాగే తీయాలనే ఫార్ములాను షేక్ చేశారని ప్రశంస
  • రామ్ గోపాల్ వర్మ గురించి తానెప్పుడూ వినలేదన్న వర్మ
సినిమా ఇలాగే తీయాలనే ఫార్ములాను పక్కన పెట్టి నేను సినిమాను ఇలాగే తీస్తాననే డైరెక్టర్లు కొందరు ఉంటారని... వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరని దర్శక దిగ్గజం రాజమౌళి ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇలాంటి డైరెక్టర్లు ఆడియెన్స్ ను షేక్ చేస్తారని, ఇండస్ట్రీని షేక్ చేస్తారని, సినిమాను ఇలాగే తీయాలనే ఫార్ములాను కూడా షేక్ చేస్తారని చెప్పారు. ఇలాంటి డైరెక్టర్లో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరని ప్రశంసించారు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన 'యానిమల్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాజమౌళి తనను ప్రశంసించడం పట్ల వర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. రామ్ గోపాల్ వర్మ గురించి ఎప్పుడూ వినలేదని సరదాగా వ్యాఖ్యానించారు.  

Advertisement
Ram Gopal Varma
Rajamouli
Tollywood

More Telugu News