బర్రెలక్క శిరీష తరఫున కొల్లాపూర్‌లో జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం
- శిరీషలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని లక్ష్మీనారాయణ పిలుపు
- శిరీష ఎమ్మెల్యే అయితే మొదట ఆనందపడేది తానేనని వ్యాఖ్య
- శిరీషకు వచ్చిన గుర్తు కూడా అందరినీ జాగృతం చేసే ఈల అన్న జేడీ లక్ష్మీనారాయణ
యానాం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాడి కృష్ణారావు ఎల్లుండి ఇక్కడకు వస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమైన అంశమన్నారు. శిరీష ఈ స్థాయికి రావడానికి కారణం సోషల్ మీడియా అని, కాబట్టి దానిని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. శిరీషకు ఈల గుర్తు వచ్చిందని, ఇది తనకు బాగా నచ్చిందన్నారు. దీంతో మనం అందరినీ జాగృతం చేయాలన్నారు. మీరు శిరీషను అసెంబ్లీకి పంపిస్తే ఇక్కడ వేసే ఈలలను అక్కడ సభలో ఈల వేసి వినిపిస్తుందని వ్యాఖ్యానించారు.