దుబ్బాకలో పవన్ కల్యాణ్ ప్రచారం.... సీఎం.. సీఎం అంటూ యువత నినాదాలు
- తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రఘునందన్ రావును గెలిపించాలని విజ్ఞప్తి
- బీజేపీ అభ్యర్థులను గెలిపించి బీసీని సీఎంగా చేసుకోవాలని పిలుపు
- బీజేపీకి ఓటు వేసి ఉపాధి కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న పవన్ కల్యాణ్
సీఎం సీఎం అంటూ నినాదాలు...
పవన్ కల్యాణ్ ఈ రోజు కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తెలంగాణ యువత 'సీఎం.. సీఎం' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సూర్యాపేటలో ఆయన వాహనం పైనుంచి మాట్లాడుతున్న సమయంలో పెద్ద ఎత్తున 'ముఖ్యమంత్రి' అంటూ నినాదాలు చేశారు.