Ram Charan: ప్రైవేట్ జెట్ లో మైసూరుకు రామ్ చరణ్.. వీడియో ఇదిగో!

Ram Charan Special Jet To Mysore For Game Changer New Schedule
షార్ట్స్‌లో చూడండి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రైవేట్ జెట్ లో మైసూర్ చేరుకున్నారు. మైసూర్ ఎయిర్ పోర్టులో ఆయన విమానం దిగి బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన కొత్త సినిమా షూటింగ్ కోసమే రామ్ చరణ్ వచ్చినట్లు సమాచారం. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ‘గేమ్ చేంజర్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, సముద్రఖని, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ గురు వారం నుంచి మైసూర్ లో ప్రారంభమైంది. దీంతో బుధవారం సాయంత్రమే రామ్ చరణ్ ప్రైవేట్ జెట్ లో మైసూరులో ల్యాండ్ అయ్యారు.

బ్లాక్ కలర్ లో ఉన్న ప్రైవేట్ జెట్ లో నుంచి రామ్ చరణ్ రాయల్ గా దిగుతున్న వీడియోను చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. సింపుల్ అవుట్ ఫిట్‌లోనూ ఆయన లుక్ అదిరిపోయిందని అంటున్నారు. ఈ షెడ్యూల్‌ లో శంకర్ కీలక సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి గేమ్ చేంజర్ నుంచి ఇప్పటికే ఓ పాట విడుదల కావాల్సింది. 'జరగండి.. జరగండి' అంటూ సాగే పాటను మొన్నటి దీపావళికే విడుదల చేస్తామని సినిమా యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, సాంకేతిక కారణాల వల్ల క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని పాట రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ ఒక్క పాట చిత్రీకరణ కోసమే డైరెక్టర్ శంకర్ కోట్లలో ఖర్చుపెట్టించినట్లు సినీ వర్గాల సమాచారం.
Go Back to Shorts
Ram Charan
Special Jet
Game Changer
shooting
new movie
entertainment
cinima news

More Telugu News