బీజేపీకి విజయశాంతి రాజీనామా... త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరిక?
- కొన్నిరోజులుగా బీజేపీపై అసంతృప్తితో ఉన్న విజయశాంతి
- కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించిన విజయశాంతి
- రేపో.. ఎల్లుండో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం
విజయశాంతి త్వరలో తమ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఇటీవల అన్నారు. బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆమె పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల పరేడ్ మైదానంలో జరిగిన... నరేంద్ర మోదీ పాల్గొన్న మాదిగల విశ్వరూప సభకు ఆమె హాజరు కాలేదు. నిన్న ఫేస్ బుక్, ఎక్స్ ప్రొఫైల్ పిక్ మార్చారు.