ప్రసూతి సెలవుల తర్వాత ఆఫీసుకెళితే.. హోదా తగ్గింపు.. ప్రైవేట్ సంస్థకు రూ.10 లక్షల ఫైన్!
- ప్రసూతి సెలవుల తర్వాత హోదా తగ్గించడంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
- బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ప్రైవేట్ సంస్థకు ఆదేశం
- మహిళల ప్రసూతి హక్కులపై సమగ్ర నిబంధనలు తేవాలని కేంద్రానికి సూచన
- పాత ఉద్యోగం లేదా సమానమైన హోదా కల్పించాల్సిందేనని స్పష్టీకరణ
ఉద్యోగం చేసే మహిళలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రసూతి సెలవుల (మెటర్నిటీ లీవ్) తర్వాత తిరిగి విధుల్లో చేరే మహిళల హోదాను తగ్గించడం లేదా వారికి ప్రాధాన్యం లేని పనులు అప్పగించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. తల్లితనం అనేది కార్యాలయాల్లో అవమానానికి, వివక్షకు కారణంగా మారడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని తేల్చిచెప్పింది. ప్రసూతి సమయంలో మహిళలకు లభించే చట్టబద్ధమైన రక్షణ కేవలం ఉద్యోగ భద్రతకే పరిమితం కాదని, వారి వృత్తిపరమైన హోదా, కెరీర్‌లో పురోగతికి కూడా వర్తిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.
కేసు నేపథ్యం ఏమిటంటే?
ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అయిన ఓ మహిళ ప్రసూతి సెలవులపై వెళ్లారు. సెలవుల అనంతరం తిరిగి ఉద్యోగంలో చేరగా, ఆమెను ట్రెజరీ విభాగానికి మార్చి క్లరికల్ తరహా పనులు అప్పగించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, తన ఉద్యోగానికి రాజీనామా చేసి న్యాయపోరాటానికి దిగారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సచిన్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం, సంస్థ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.1.5 లక్షలు చెల్లించాలని ఆ ప్రైవేట్ సంస్థను ఆదేశించింది.
కోర్టు కీలక ఆదేశాలు
ప్రసూతి సెలవుల నుంచి తిరిగి వచ్చిన మహిళకు, ఆమె గతంలో నిర్వహించిన పదవినే తిరిగి కేటాయించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ సంస్థాగత కారణాల వల్ల ఆ పోస్టు అందుబాటులో లేకపోతే, జీతం, గ్రేడ్, హోదా, బాధ్యతలు, అధికారాలు, భవిష్యత్ అవకాశాల పరంగా దాదాపు సమానమైన మరో పదవిని కల్పించాలని ఆదేశించింది. ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న ప్రసూతి ప్రయోజన చట్టం, సామాజిక భద్రతా కోడ్-2020లో సమగ్రమైన మార్గదర్శకాలు లేవని అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో ప్రసూతి అనంతరం మహిళల హక్కుల పరిరక్షణకు పటిష్ఠమైన నిబంధనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగ హోదాకు రక్షణ, విధుల్లో సమానత్వం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం, కార్యాలయాల్లో పరోక్ష వేధింపుల నుంచి రక్షణ వంటి అంశాలపై ఆరు నెలల్లోగా స్పష్టమైన రూల్స్ తీసుకురావాలని సూచించింది. ఒకవేళ మహిళ తన పరిస్థితుల దృష్ట్యా పనివేళలు, పని విధానంలో మార్పులు కోరితే, యాజమాన్యం దానిని సానుభూతితో పరిశీలించాలని కూడా తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షలాది మంది మహిళా ఉద్యోగులకు భరోసా ఇచ్చేదిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.