గాయం నాటకం.. పాక్ క్రికెటర్ ఇమామ్‌పై రెండేళ్ల నిషేధం?
- గాయం వివాదంలో చిక్కుకున్న పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్
- రెండేళ్ల వరకు నిషేధం విధించే అవకాశంపై పీసీబీ విచారణ
- వికెట్ కీపర్ రిజ్వాన్‌తో సహా ఏడుగురు ఆటగాళ్లపై వేటు
- హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కూడా తొలగించిన పాక్ బోర్డు
- ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు జట్టులో భారీ మార్పులు
పాకిస్థాన్ క్రికెట్‌లో తీవ్ర వివాదం చెలరేగింది. గాయం పేరుతో జట్టును తప్పుదోవ పట్టించాడనే ఆరోపణలతో స్టార్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల వరకు నిషేధం పడే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు 'జియో న్యూస్' తన కథనంలో సంచలన విషయాలు వెల్లడించింది.
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మొదటి రోజు ఫీల్డింగ్ చేస్తూ ఇమామ్ గాయపడ్డాడు. దీంతో అతను రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు రాలేదు. పాకిస్థాన్ ఒక ఆటగాడి సేవలను కోల్పోయి, ఆ మ్యాచ్‌లో 194 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో ఇంగ్లండ్‌కు సమర్పించుకుంది. అయితే, నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ఇమామ్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు టీవీ కెమెరాల్లో కనిపించాయి. దీంతో అతను గాయం నాటకం ఆడాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలోనూ ఇమామ్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఈ వివాదానికి మరింత బలాన్నిచ్చింది.
ఈ వివాదం కేవలం ఇమామ్‌తోనే ఆగేలా కనిపించడం లేదు. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ క్రమశిక్షణపై కూడా పీసీబీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రిజ్వాన్‌ను కూడా విచారించవచ్చని, అతడిని సమీప భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవచ్చని సమాచారం.
వరుస ఓటముల నేపథ్యంలో పీసీబీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. చివరి టెస్టుకు ముందు జట్టులో భారీ మార్పులు చేసింది. ఇమామ్, రిజ్వాన్‌తో పాటు సల్మాన్ అలీ అఘా, అలీ ఉస్మాన్, ఖుర్రం షాజాద్ సహా మొత్తం ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది. వారి స్థానంలో ఐదుగురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. అంతేగాక హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను బాధ్యతల నుంచి తప్పించి, వైట్ బాల్ కోచ్ మైక్ హెస్సన్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన ఇంగ్లండ్, బర్మింగ్‌హామ్‌లో జరిగే చివరి టెస్టులోనూ గెలిచి 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.