'పుష్ప 2' కోసం జాతర ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం: 'మంగళవారం' ఈవెంటులో అల్లు అర్జున్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పుష్ప 2' కోసం జాతర ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం: 'మంగళవారం' ఈవెంటులో అల్లు అర్జున్

Mangalavaram Pre Release Event
  • 'మంగళవారం' ఈవెంటులో మెరిసిన అల్లు అర్జున్
  • ఈ సినిమా తీయడానికి ధైర్యం కావాలని వ్యాఖ్య 
  • అజయ్ భూపతి మంక్చి టెక్నీషియన్ అంటూ ప్రశంసలు 
  • 'పుష్ప 2' ఆగస్టులో వస్తుందని వెల్లడి

అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హైదరాబాదులో 'మంగళవారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. పాయల్ ప్రధానమైన పాత్రగా అజయ్ భూపతి రూపొందించిన సినిమా ఇది. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ .. " ఈ సినిమా టీజర్ చూడగానే నాకు బాగా నచ్చేసింది. నాకు అజయ్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన గొప్ప టెక్నీషియన్ అనే విషయం నాకు అర్థమైంది" అన్నారు. 

ఈ సినిమా టీజర్ ను సుకుమార్ కూడా చూసి ఆశ్చర్యపోయాడు. అంత బాగా అజయ్ భూపతి తీశాడు. 'మంగళవారం' లాంటి కంటెంట్ తీయడానికి చాలా ధైర్యం కావాలి. అజయ్ అలాంటి ధైర్యం చేశాడు. ఇక స్వాతి ఈ సినిమాతో నిర్మాతగా మారడం నాకు సంతోషాన్ని కలిగించే విషయం. ఇప్పుడు నేను 'పుష్ప 2' షూటింగు నుంచే వచ్చాను. ప్రస్తుతం అక్కడ జాతర ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నాము

ఈ సినిమా వచ్చే ఆగస్టు 15న విడుదలవుతుంది. 'పుష్ప 2'' అస్సలు తగ్గేదే లే. 'మిగతా విషయాలను వేరే ఈవెంటులో మాట్లాడుకుందాము. నాకు నేషనల్ అవార్డు వచ్చిన తరువాత చాలామంది అభినందనలు తెలియజేశారు. మీ అందరి ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.

Advertisement
Mangalavaram
Ajay Bhupathi
payal
Allu Arjun

More Telugu News