వేములవాడ టిక్కెట్... తుల ఉమ ఇంటికి వరుస కడుతున్న నేతలు
- తుల ఉమ ఇంటికి ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్
- తుల ఉమ గొప్ప తెలంగాణ ఉద్యమ నాయకురాలు అన్న విష్ణునాథ్
- రాజకీయ ప్రయోజనాల కోసం రాలేదని... సానుభూతి తెలిపేందుకు వచ్చామన్న కాంగ్రెస్ నేత
తుల ఉమను కలిసిన అనంతరం విష్ణునాథ్ మాట్లాడుతూ... ఆమె గొప్ప తెలంగాణ ఉద్యమ నాయకురాలు అన్నారు. బీజేపీ ఆమెను మోసం చేసిందన్నారు. తుల ఉమ ప్రజల కోసం పోరాడారని, సామాన్యులకు అండగా నిలబడ్డారన్నారు. తాము రాజకీయ ప్రయోజనాల కోసం రాలేదని, ఆమెను కలిసి సానుభూతి తెలిపేందుకు మాత్రమే వచ్చామన్నారు. తుల ఉమ సీనియర్ లీడర్ అని, మంచి పేరుందని, తెలంగాణ ఉద్యమంలో పని చేశారన్నారు. ఆమె ఎప్పుడూ ప్రజల్లో ఉన్న నాయకురాలు అన్నారు. అలాంటి మహిళకు బీ-ఫామ్ ఇవ్వకుండా మోసం చేశారన్నారు.