'మొగలి రేకులు' సాగర్ కు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan appoints actor Sagar as Janasena party campaign secretary
  • ఇటీవల జనసేన పార్టీలో చేరిన నటుడు సాగర్
  • సాగర్ ను పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించిన పవన్ కల్యాణ్
  • తెలంగాణలో జనసేన-బీజేపీ కూటమి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన
  • కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని దిశానిర్దేశం
'మొగలి రేకులు' టీవీ సీరియల్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకుని, సినీ నటుడిగానూ ఎంట్రీ ఇచ్చిన ములుకుంట్ల సాగర్ ఇటీవల జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, సాగర్ కు జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. సాగర్ ను తెలంగాణలో జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు హైదరాబాదులోని ప్రశాసన్ నగర్ లో ఉన్న జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో, పవన్ కల్యాణ్ నటుడు సాగర్ కు నియామక పత్రాన్ని అందించారు. 

తెలంగాణ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కూటమి సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని , ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని సాగర్ కు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
Go Back to Shorts
Sagar
Pawan Kalyan
Janasena
Telangana

More Telugu News