పవన్ కల్యాణ్‌ను వాడుకుంటున్నారు: బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభపై వీహెచ్
- ప్రధాని మోదీకి ఎన్నికలకు ముందు బీసీలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్న
- బీసీల కోసం కాంగ్రెస్ పార్టీయే ఎంతో చేసిందన్న వీహెచ్
- ప్రత్యేక హోదా అడిగిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మోదీ పక్కన చేరారని ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలని అడిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు నరేంద్ర మోదీ పక్కన చేరారని విమర్శించారు. పవన్ కల్యాణ్‌ను బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని ఆరోపించారు. బీసీల గురించి చెబుతున్న పవన్ కల్యాణ్ కాపు వ్యక్తి అన్నారు. ప్రయివేటు పరిశ్రమలలో రిజర్వేషన్స్ ఎందుకు అడగలేదో చెప్పాలన్నారు. మోదీ ఓబీసీలకు చేస్తున్న మోసాన్ని అందరూ గమనించాలన్నారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేది ఒక కాంగ్రెస్ పార్టీయే అన్నారు.