'స్కంద' ఫైటింగ్ సీన్ పై ట్రోలింగ్... ఫొటోతో బదులిచ్చిన రామ్
Add ap7am to your home Screen

'స్కంద' ఫైటింగ్ సీన్ పై ట్రోలింగ్... ఫొటోతో బదులిచ్చిన రామ్

Ram replies to trolling with a photo
  • రామ్, బోయపాటి కాంబోలో స్కంద
  • సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం
  • బోయపాటి ఓ ఫైట్ సీన్ చేసి చూపిస్తున్న ఫొటో వైరల్
  • నెట్టింట మీమ్స్ తో విరుచుకుడిన విమర్శకులు
ఎనర్జటిక్ హీరో రామ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో ఓ ఫైటింగ్ సీన్ పై నెట్టింట భారీ ట్రోలింగ్ జరుగుతోంది. మీమ్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా, సెట్స్ పై ఓ ఫైటింగ్ సీన్ ను బోయపాటి చేసి చూపిస్తున్న ఫొటోను వైరల్ చేస్తున్నారు. 

దీనిపై హీరో రామ్ పోతినేని స్పందించారు. ఆ ఫైటింగ్ సీన్ కోసం తాను ఎంత కష్టపడిందీ వివరించారు. తన పాదాలకు రక్తం కారుతున్న ఫొటోను కూడా రామ్ పంచుకున్నారు. ఏప్రిల్ నెలలో, వేసవి కాలంలో ఆ సీన్ షూట్ చేశామని, ఆ ఫైట్ సీక్వెన్స్ అయిపోయాక తాను సరిగ్గా నడవలేకపోయానని వెల్లడించారు. 

"ఆ ఫైట్ సీన్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే... నేను ఒక సీన్ చేశాక నేను నడవలేకపోయాను. లేని ఓపిక తెచ్చుకుని నడవబోయాను. కానీ పాదాల నుంచి రక్తం వచ్చింది. దాంతో ఆ సీన్ ఎలా రావాలన్నదానిపై దర్శకుడు బోయపాటి చేసి చూపించారు. ఆడియన్స్ కోసం రక్తం, చెమట చిందించడానికి నేను సిద్ధంగా ఉంటాను. ప్రేక్షకులకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి... వారి అభిప్రాయాలను ఎప్పుడూ గౌరవిస్తాను" అని రామ్ పేర్కొన్నారు.
Advertisement
Ram
Trolling
Skanda
Photo
Netizens

More Telugu News