వరల్డ్ కప్ లో అందరికంటే భారీ సిక్సర్ కొట్టిన శ్రేయాస్ అయ్యర్... వీడియో ఇదిగో!
- శ్రీలంకపై చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
- 56 బంతుల్లో 82 రన్స్
- 3 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం
- రజిత బౌలింగ్ లో 106 మీటర్ల సిక్స్ కొట్టిన శ్రేయాస్ అయ్యర్
గిల్ అవుట్ కావడంతో బరిలో దిగిన శ్రేయాస్ అయ్యర్... సొంతగడ్డపై బ్యాట్ ఝళిపించాడు. లంక పేసర్ కసున్ రజిత వేసిన ఓ ఆఫ్ వ్యాలీని లాంగాఫ్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. ఇది 106 మీటర్ల దూరం దూసుకెళ్లింది. స్టేడియంలో స్టాండ్స్ కు తగిలి కిందపడింది.
ఈ వరల్డ్ కప్ లో ఇదే అత్యంత భారీ సిక్సర్. దాంతో, ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కొట్టిన 104 మీటర్ల సిక్సర్ తెరమరుగైంది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ 56 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అయ్యర్ స్కోరులో 3 ఫోర్లు, 6 భారీ సిక్సులు ఉన్నాయి.