రెండు శాతం ఓట్లు కూడా సంపాదించలేని బీజేపీ అలాంటి హామీ ఇవ్వడం విడ్డూరం: రాహుల్ గాంధీ ఎద్దేవా
- బీజేపీ తీరు ఎలా ఉందంటే అమెరికాకు ప్రెసిడెంట్‌గా ఓబీసీని చేస్తామని హామీ ఇచ్చినట్లుగా ఉందని ఎద్దేవా
- బీజేపీకి అండగా ఉండేందుకే మజ్లిస్ పార్టీ పలుచోట్ల పోటీ చేస్తుందని ఆరోపణ
- జైహింద్... జై తెలంగాణ అంటూ ప్రసంగం ముగించిన రాహుల్ గాంధీ
మజ్లిస్ పార్టీ పైనా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఆ పార్టీ పోటీ చేస్తుందన్నారు. తద్వారా బీజేపీకి సహకరించేందుకే ఎన్నికల బరిలోకి దిగుతుందన్నారు. బీజేపీ ఇచ్చే డబ్బుల కోసం మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌ను ఓడించే ఉద్దేశ్యంతో పోటీ చేస్తుందని ఆరోపించారు. బీజేపీ, మజ్లిస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. మొదట మనం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కారును ఓడించి ఆ తర్వాత ఢిల్లీలో బీజేపీని ఓడిద్దామని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు. నమస్కారం... జైహింద్... జైతెలంగాణ అని ప్రసంగం ముగించారు.