బీజేపీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా
- రాహుల్ గాంధీతో భేటీ.. కాంగ్రెస్ లో చేరనున్న వివేక్
- 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికైన లీడర్
- కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపిన వివేక్
కాంగ్రెస్ పార్టీ నుంచి 2009 లో వివేక్ పెద్దపెల్లి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) లో చేరారు. తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మరోమారు బీఆర్ఎస్ లో చేరిన వివేక్.. ఈ రోజు వరకు బీజేపీలో కొనసాగారు. వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, అలాంటిదేం లేదని ఆయన కొట్టిపారేస్తూ వస్తున్నారు. తాజాగా, ఆయన తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు.