మంత్రి పువ్వాడ అజయ్ వాహనంలో ఎన్నికల అధికారుల తనిఖీలు
- రఘునాధపాలెం నుంచి కోయచలక గ్రామానికి వెళ్తుండగా వాహనం తనిఖీ
- సహకరించిన మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు
- ఎన్నికల నియమావళిలో ఇలాంటివి సాధారణమేనన్న మంత్రి
ఆ సమయంలో మంత్రి అజయ్ వెంట డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణంతోపాటు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరంతా ఎన్నికల అధికారుల తనిఖీలకు సంపూర్ణంగా సహకరించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మంత్రి తెలియజేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విధి నిర్వహణలో ఇలాంటి తనిఖీలు సర్వ సాధారణమేనని అజయ్ వ్యాఖ్యానించారు. తాను అధికారులకు ఎప్పుడైనా సహకరిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ తరపున ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.