Vijay: విజయ్ 68వ సినిమా కథ తిరిగేది ఈ పాయింట్ చుట్టూనే!

Vijay New 68th Movie Update
షార్ట్స్‌లో చూడండి
విజయ్ 67వ సినిమాగా 'లియో' థియేటర్లకు వచ్చి వారం రోజులు తిరక్కముందే, ఆయన 68వ సినిమా పట్టాలెక్కింది. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఆర్టిస్టులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో విజయ్ తో 'బిగిల్' సినిమాను చేసిన నిర్మాతలే ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నిన్న ఈ సినిమాకి క్లాప్ పడిన దగ్గర నుంచి, కథ ఏమై ఉంటుందనే విషయంపై అభిమానుల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కథ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడుస్తుందని తెలుస్తోంది. అంటే టైమ్ మెషిన్ చుట్టూ తిరుగుతుందన్న మాట. 

ఇంతకుముందు టైమ్ ట్రావెల్ సినిమాలు కొన్ని వచ్చాయి. అయితే ఏ పాయింట్ కి టైమ్ మెషిన్ ను యాడ్ చేయనున్నారనేది ఆసక్తిని రేకెత్తించే విషయం. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, ప్రియాంక అరుళ్ మోహన్ .. మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా అలరించనున్నారు. ముఖ్యమైన పాత్రల్లో స్నేహ .. లైలా కనిపించనున్నారు. 
Go Back to Shorts
Vijay
Priyanka Arul Mohan
Meenakshi Choudary
Sneha
laila

More Telugu News