Renu Desai: "పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా?" అన్న ప్రశ్నకు రేణూ దేశాయ్ స్పందన

Renu Desai answers the question whether she wants Pawan Kalyan to become CM
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటి రేణూ దేశాయ్ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. రవితేజ ప్రధాన పాత్ర పోషించిన ఈ బయోపిక్ మూవీ ఇటీవలే రిలీజైంది. ఈ చిత్రంలో ప్రముఖ సంఘసంస్కర్త హేమలతా లవణం పాత్రను రేణూ దేశాయ్ పోషించారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు రేణూ స్పందించారు. ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసని, దేవుడు ఏం రాసిపెడితే అది జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో అభిప్రాయం చెప్పడానికి నేనెవర్ని? అంటూ ప్రశ్నించారు. 

ఈ అంశంలో తాను ఎటువైపూ మొగ్గు చూపడంలేదని, తాను తటస్థంగా ఉంటానని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. ఇటీవల కూడా తాను ఉన్న నిజాలే చెప్పానని, ఇవాళ కూడా అదే చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తికి మద్దతుగా మాట్లాడడమో, ఈ వ్యక్తికి మద్దతుగా మాట్లాడడమో చేయనని, తనకు ఏమనిపించిందో అదే చెబుతానని వెల్లడించారు.
Go Back to Shorts
Renu Desai
Pawan Kalyan
Chief Minister
Janasena
Andhra Pradesh

More Telugu News