అనుక్షణం ఆసక్తిని రేకెత్తించే 'అపూర్వ' .. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ పైకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్
- నాయిక ప్రధానమైన సిరీస్ గా 'అపూర్వ'
- టైటిల్ రోల్ ను పోషించిన తార సుతారియా
- అనూహ్యమైన మలుపులతో సాగే కథ
- నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్
ఒక సాధారణమైన యువతి తనకి ఎదురైన అనూహ్యమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంది? అసాధారణమైన పరిణామాలను ఎలా తట్టుకుని నిలబడగలిగింది? అనేది ఈ కథలోని ప్రధానమైన అంశం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సిరీస్, నవంబర్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానుంది.
ఇండియాలోని అత్యంత ప్రమాదకరమైన లొకేషన్స్ లో ఈ సిరీస్ ను చిత్రీకరించినట్టుగా మేకర్స్ చెబుతున్నారు. తాజాగా వదిలిన పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తనని వెంటాడుతున్న వారి నుంచి తప్పించుకునే పనిలో ఉన్న నాయిక, అవసరమైతే తిరగబడే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ఆడియన్స్ ఎదురుచూసే సిరీస్ ల జాబితాలో ఇప్పుడు ఇది కూడా చేరిపోయినట్టే.