తెలంగాణలో బీజేపీ దూకుడు.. బండి సంజయ్‌కు మళ్లీ కీలక బాధ్యతలు
- 14 కమిటీలను ఏర్పాటు చేసిన బీజేపీ నాయకత్వం
- పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి చైర్మన్‌గా బండి సంజయ్
- వివేక్ వెంకటస్వామికి మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ బాధ్యతలు
ఇక పార్టీని వీడుతారన్న వార్తల నడుమ ఎన్నికల మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగించింది. కన్వీనర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను నియమించింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చార్జిషీట్ కమిటీ ఛైర్మన్ గా మురళీధర్రావు, పోరాట కమిటీ ఛైర్మన్ గా విజయశాంతికి బాధ్యతలు అప్పగించింది. ఇక, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు కీలక నేతలు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్ హాజరయ్యారు. ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా కౌన్సిల్ సమావేశం జరగనుంది.