అమ్మా, బ్రాహ్మణీ... ఆల్రెడీ మోత మోగించారు, ఇంకా భ్రమల్లో ఉన్నట్లున్నావు!: మంత్రి రోజా చురకలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మా, బ్రాహ్మణీ... ఆల్రెడీ మోత మోగించారు, ఇంకా భ్రమల్లో ఉన్నట్లున్నావు!: మంత్రి రోజా చురకలు

Minister Roja satires on Nara Brahmani
  • మీ మామ అడ్డగోలుగా అవినీతి మేత మేసి జైలుకెళ్తే ప్రజల మద్దతు కోరుతావా? అని ప్రశ్న
  • చంద్రబాబు మోసానికి 2019లోనే ప్రజలు మోత మోగించి, 23 సీట్లతో ఇంటికి పంపించారని ఎద్దేవా
  • మంగళగిరిలో మీ భర్తకు మోత మోగించి ఓడించారని వ్యాఖ్య
  • న్యాయవ్యవస్థకు అతీతులా? అని నిలదీత
పాలకుల అక్రమాలను ప్రశ్నిద్దామని, రేపు రాత్రి ఏడు గంటల నుంచి ఐదు నిమిషాల పాటు మోత మోగిద్దామంటూ పిలుపునిచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణికి మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్తే, అలాంటి అవినీతిపరుడికి ప్రజల మద్దతును కోరడం ఏమిటని ప్రశ్నించారు. మంగళగిరిలో నీ భర్త లోకేశ్‌ను ప్రజలు ఓడించారన్నారు. అయినా కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జైల్లో పెడితే మీ మామకు మద్దతుగా ఆందోళన చేస్తావా? అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

'అమ్మ, మీ మామ అడ్డగోలుగా అవినీతి  మేత మేసి జైలుకి వెళితే మీరేమో ఆ అవినీతిపరుడుకి మద్దతుగా ప్రజలను మోత మోగించమంటారా..? ఇదెక్కడి విడ్డురం? మీ మామ మోసానికి, అవినీతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లోనే మోత మోగించి 23 సీట్లతో ఇంటికి పంపించారు. మీ భర్త లోకేశ్‌కు మంగళగిరిలో ఎలా మోత మోగించి ఓడించారో గుర్తులేదా..?  మీ మామ ఏమో అన్ని రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొడితే.. నువ్వు, నీ భర్త ముద్రగడ పోరాటాన్ని కాపీ కొట్టి పళ్ళాలు, ప్లేట్లు, బెల్లులు కొట్టమంటున్నారు.. బావుంది. మీ ఫామిలీ అంతా కాపీ కొట్టడమేనా..?

నీ మామ మీద ప్రపంచం బెంగ పెట్టుకుందని మీరంతా భ్రమల్లో ఉన్నట్లున్నారు. కానీ నారాకాసురుడు ఇన్నాళ్లకు దొరికాడని ప్రజలంతా ముందుగానే దీపావళి చేసుకుంటున్నారు. బకాసురుడిలా ప్రజల సొమ్మును దోచేసిన నీ మామ చంద్రబాబు మీద చర్యలకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జైల్లో పెడితే ఆయనకు మద్దతుగా ఆందోళన చేస్తావా? అంటే మీరు కోర్టుల కంటే  గొప్పోళ్లా ..? న్యాయవ్యవస్థ కంటే అతీతులా..?  కోర్టుల నిర్ణయాలకు వ్యతిరేకం అవుతుందన్న జ్ఞానం లేదా..?' అని ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.
Advertisement
Roja
nara bhrahmani
Nara Lokesh
Chandrababu

More Telugu News