హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీరు
- ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇబ్బందులు
- మూడ్రోజుల పాటు వర్షాలు ఉన్నాయని తెలిపిన వాతావరణ కేంద్రం
ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనారులు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయమంతా నగరాన్ని మేఘాలు కమ్మివేశాయి. సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. బుధ, గురు, శుక్రవారాల్లో తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురవవచ్చునని తెలిపింది.