Narendra Modi: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు... తాజా షెడ్యూల్ ఇదిగో!

PM Modi Telangana tour schedule revised
షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబరు 1న తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, పాలమూరులో బీజేపీ సమరభేరి సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అయితే మోదీ పర్యటనలో ఒక మార్పు చోటుచేసుకుంది. తొలుత ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి మహబూబ్ నగర్ వెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే, బేగంపేట నుంచి కాకుండా శంషాబాద్ నుంచి మోదీ మహబూబ్ నగర్ వెళతారని తాజాగా ప్రకటన చేశారు.

కొత్త షెడ్యూల్ ఇదే...

  • అక్టోబరు 1 మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరిక
  • మధ్యాహ్నం 1.35 గంటలకు హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ పయనం
  • 2.05 గంటలకు మహబూబ్ నగర్ చేరుకోనున్న ప్రధాని
  • 2.15 గంటల నుంచి 2.50 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ సమరభేరి సభకు హాజరు
  • సాయంత్రం 4 గంటల తర్వాత హెలికాప్టర్ శంషాబాద్ పయనం... అక్కడ్నించి ఢిల్లీ బయల్దేరనున్న ప్రధాని
Go Back to Shorts
Narendra Modi
Mahaboobnagar
BJP
Telangana Assembly Election

More Telugu News