తెలంగాణలో వెలువడిన టెట్ ఫలితాలు

తెలంగాణలో వెలువడిన టెట్ ఫలితాలు

Telangana TET results declared
  • సెప్టెంబర్ 15న ముగిసిన పరీక్ష
  • 12 రోజుల్లోనే వెలువడిన ఫలితాలు
  • హాల్ టికెట్ నంబర్ తో ఆన్ లైన్ లో తెలుసుకునే సదుపాయం
రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను తెలంగాణ పాఠశాల విద్యా శాఖ బుధవారం విడుదల చేసింది. పరీక్ష రాసిన వారు ఫలితాలను  tstet.cgg.gov.in వెబ్ సైట్ నుంచి చూసి తెలుసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీని ఈ నెల మొదట్లోనే విడుదల చేయడం గమనార్హం. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని పాఠశాల విద్యా శాఖ అప్పుడే కోరింది. 

టెట్ 2023 ను సెప్టెంబర్ 15న నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన కేవలం 12 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. పరీక్షా ఫలితాలు తెలుసుకునే విషయంలో ఏవైనా అవరోధాలు ఎదురైతే 7075875862 లేదా 7075875894 నంబర్లలో సంప్రదించొచ్చు. హాల్ టికెట్ నంబర్ సాయంతో ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Advertisement
Telangana
TET results
released

More Telugu News