జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' రష్ చూశాను.. మైండ్ బ్లోయింగ్: ఉమైర్ సంధు
- ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'దేవర'
- ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందన్న ఉమైర్ సంధు
- 2024 ఏప్రిల్ 5న విడుదలవుతున్న భారీ బడ్జెట్ మూవీ
మరోవైపు, ఎన్టీఆర్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్తను ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన 10 సెకన్ల రష్ చూశానని... మైండ్ బ్లోయింగ్ గా ఉందని ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందని చెప్పాడు. ఈ ఎపిక్ సాగా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని అన్నాడు. ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఇంకోవైపు, ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్లతో నిర్మిస్తున్నట్టు సమాచారం.