జమిలి ఎన్నికలకు జై కొట్టనున్న కేంద్రం.. మాజీ రాష్ట్రపతి కోవింద్ కు కీలక బాధ్యతలు
- ‘ఒక దేశం - ఒకే ఎన్నిక’ కోసం ప్యానెల్ ఏర్పాటు
- కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సారథ్యం
- పార్లమెంట్ లో బిల్లు పెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం
‘ఒక దేశం - ఒకే ఎన్నిక‘ పేరుతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్ర భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కోవింద్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో ఒకేసారి లోక్ సభ, అయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహణపై సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీలో 16 మందితో సభ్యులు ఉంటారని తెలుస్తోంది. కమిటీలో ఇతర సభ్యుల పేర్లతో ఓ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.