ముంబైలోని అమితాబ్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టిన మమతా బెనర్జీ

Mamata Banerjee ties rakhi to amithabh
  • విపక్ష I.N.D.I.A. కూటమి సమావేశం కోసం ముంబైకి వచ్చిన మమతా బెనర్జీ
  • మమతను తేనీటి విందుకు ఆహ్వానించిన అమితాబ్ బచ్చన్
  • బచ్చన్ కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమన్న దీదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టారు. అగస్ట్ 31, సెప్టెంబర్ 1న ముంబైలో విపక్ష కూటమి I.N.D.I.A. కీలక భేటీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ భేటీ కోసం దేశ ఆర్థిక రాజధానికి వచ్చిన మమతను అమితాబ్ తేనీటి విందుకు ఆహ్వానించారు. ఈ క్రమంలో బుధవారం జుహులోని అమితాబ్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. అమితాబ్ కుటుంబ సభ్యులతో దీదీ కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... అమితాబ్ నివాసానికి రావడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. ఆయనకు రాఖీ కట్టినట్లు చెప్పారు. అమితాబ్ కుటుంబం అంటే తనకు ఎనలేని ఇష్టమని, ఆ కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసిందన్నారు. బెంగాల్‌లో దుర్గా పూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి వారిని ఆహ్వానించినట్లు చెప్పారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కూడా మమత రాఖీ కట్టారు.
Advertisement
Mamata Banerjee
tmc
India

More Telugu News