అబయ డ్రెస్‌పై ఫ్రాన్స్ నిషేధం.. పౌర హక్కుల ఉల్లంఘనేనంటూ విమర్శలు
- ప్రకటించిన ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి
- సెక్యులరిజం దాడేనంటూ విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు
- 2004లో మత చిహ్నాల ప్రదర్శనపై నిషేధం
- దీంతో అబయ డ్రెస్‌కు మారిన ముస్లిం అమ్మాయిలు
ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అబయ డ్రెస్ ధరించకుండా నిషేధించడమంటే పౌర హక్కులను ఉల్లంఘించడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, మంత్రి మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సెక్యులరిజం అంటే పాఠశాల ద్వారా విముక్తి పొందే స్వేచ్చ అని పేర్కొన్నారు. అంతేకానీ, తరగతి గదిలోని విద్యార్థులను చూసి వారి మతాన్ని గుర్తించడం కాదని తేల్చి చెప్పారు. కాగా, అబయ డ్రెస్ అనేది శరీరాన్ని కాలి వేళ్ల వరకు కనిపించకుండా ధరించే డ్రెస్.
విద్యార్థులు తమ మతాన్ని ప్రదర్శించేలా ఎలాంటి దుస్తులు ధరించకుండా మార్చి 2004లోనే ప్రభుత్వం నిషేధించింది. ఇందులో శిలువలు, యుదు కిప్పాస్‌లు, ఇస్లామిక్ హెడ్‌స్కార్ఫ్‌లు ఉన్నాయి. దీంతో ముస్లిం అమ్మాయిలు ఇస్లామిక్ హెడ్‌స్కార్ఫ్‌లకు బదులుగా పొడవైన బ్యాగీ వస్త్రం (అబయ)ను ధరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు దానిని కూడా నిషేధించనున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది.