రంగన్నగూడెం ఘర్షణల్లో టీడీపీ నేతలపై కేసు... ఏ1గా యార్లగడ్డ వెంకట్రావు
- ఇటీవల గన్నవరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- రంగన్నగూడెం వద్ద ఉద్రిక్తతలు
- పోలీస్ స్టేషన్ వద్ద కూడా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య బాహాబాహీ
అయితే ఈ ఘర్షణలకు సంబంధించి పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.
ఈ కేసుల్లో 50 మందికి పైగా నిందితులుగా పేర్కొన్నారు. వైసీపీకి రాజీనామా చేసి ఇటీవలే టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావును ఈ కేసులో ఏ1గా పేర్కొనడం గమనార్హం. అమెరికాలో ఉన్న ఆళ్ల గోపాలకృష్ణ అనే వ్యక్తిని కూడా ఈ కేసుల్లో నిందితుడిగా పేర్కొన్నట్టు సమాచారం.
ఇక, టీడీపీ మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలపైనా రంగన్నగూడెం ఘర్షణలకు సంబంధించి కేసు నమోదైంది.