మనకిక తిరుగేలేదు..ఇస్రోకు ఇదే నా సెల్యూట్: టీడీపీ అధినేత చంద్రబాబు
- ఇండియా జాబిల్లిపై కాలిడిందని టీడీపీ అధినేత వ్యాఖ్య
- ఇస్రో సంకల్పబలానికి, స్ఫూర్తికి ఇదే నా వందనమని కామెంట్
- ఇస్రోకు నారా లోకేశ్ కూడా శుభాకాంక్షలు
- ఎందరో కన్న కలను సాకారం చేసిందని కామెంట్
చంద్రయాన్-3 విజయవంతం కావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ‘‘తమ మనసైన వారిని చంద్రుడిపైకి చేరుస్తామంటూ ఎందరో కవులు, కళాకారులు తమ భావాలకు అక్షరరూపమిచ్చారు. కానీ ఇస్రో మాత్రమే ఈ కలను సాకారం చేసి చూపింది. ఈ క్షణం ప్రతి భారతీయుడికీ గర్వకారణం. దక్షిణ ధ్రువంపై విజయవంతంగా చంద్రయాన్-3ని దించిన ఇస్రోకు హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని నారా లోకేశ్ *ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించారు.