చిరంజీవి 'భోళాశంకర్' నుంచి 'మిల్కీ బ్యూటీ' సాంగ్ లిరికల్ వీడియో విడుదల
- మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళాశంకర్
- మెహర్ రమేశ్ దర్శకత్వంలో మాస్ ఎంటర్టయినర్ మూవీ
- ఆగస్టు 11న విడుదల
ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో తెరకెక్కుతున్న భోళాశంకర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలి పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇందులో సుశాంత్, వెన్నెల కిశోర్, తరుణ్ అరోరా, మురళి శర్మ, బ్రహ్మాజీ, శ్రీముఖి, గెటప్ శ్రీను, హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు.
భోళాశంకర్ చిత్రం నుంచి ఇప్పటికే భోళా మేనియా, జాం జాం జజ్జనక గీతాలు రిలీజ్ అయ్యాయి. ఆడియన్స్ నుంచి వీటికి విశేష స్పందన లభిస్తోంది.