Mahesh Babu: 'హీల్ ఏ చైల్డ్' కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేశ్ బాబు, నమ్రత... ఫొటోలు ఇవిగో!

Mahesh Babu and Namrata attends Heel A Child event
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలకు మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ఎంతో సమయం కేటాయిస్తుంటారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో వందల సంఖ్యలో చిన్నారులకు హృదయ సంబంధ శస్త్రచికిత్సలు చేయిస్తూ మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

మహేశ్ బాబు హీల్ ఏ చైల్డ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం వెల్లడైంది. పేదరికంలో ఉన్న చిన్నారులకు ఈ హీల్ ఏ చైల్డ్ సంస్థ వైద్య సేవలు అందిస్తుంటుంది. 

కాగా, హీల్ ఏ చైల్డ్ సంస్థ ఏర్పాటు చేసిన కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గేమ్ చేంజర్-2023 పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు తన సామాజిక దృక్పథాన్ని చాటుతూ ప్రసంగించారు. హీల్ ఏ చైల్డ్ ఎన్జీవో సేవలను కొనియాడారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
Go Back to Shorts
Mahesh Babu
Namrata
Heel A Child
Game Changer-2023
Superstar
Tollywood

More Telugu News