కాసేపట్లో జగన్ ను కలవనున్న రామ్ గోపాల్ వర్మ
- తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో సీఎంతో భేటీ కానున్న వర్మ
- మిథున్ రెడ్డితో కలిసి జగన్ కార్యాలయానికి ఆర్జీవీ
- జగన్ కథతో సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ఆయన ట్విట్టర్ వేదికగా క్రమం తప్పకుండా విమర్శలు గుప్పిస్తుంటారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన గతంలో సినిమాను కూడా తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ కథతో సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో జగన్ తో వర్మ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.