Vaishnav Tej: 'ఆదికేశవ' నుంచి స్పెషల్ గ్లింప్స్!

Adikeshava movie glimpes released
షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య కాలంలో ఇలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, అలా దూసుకుపోయిన కథానాయికగా శ్రీలీల మాత్రమే కనిపిస్తుంది. మొదటి సినిమా 'పెళ్లిసందD' ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ అప్పటికే ఆమె అరడజను సినిమాలను చేతిలో పెట్టేసుకుంది. 'ధమాకా' హిట్ ఆమె దూకుడు మరింతగా పెరిగిపోయింది. 

చాలా తక్కువ సమయంలో ఓ పది సినిమాలకు సైన్ చేయడం ఇప్పటి టాలీవుడ్ హీరోయిన్స్ లో ఆమె విషయంలోనే జరిగి ఉంటుందేమో. అలా ఆమె చేస్తున్న సినిమాల జాబితాలో 'ఆదికేశవ' కూడా ఒకటిగా కనిపిస్తుంది. ఈ రోజున శ్రీలీల బర్త్ డే కావడంతో, ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ ను వదిలారు. ఆమె బర్త్ డే సందర్భానికి తగినట్టుగానే ఈ గ్లింప్స్ ఉండటం తమాషాగా అనిపిస్తుంది. 

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి, శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నాగవంశీ - సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో మాస్ యాక్షన్ హీరోగా కూడా మార్కులు కొట్టేయడానికి వైష్ణవ్ ట్రై చేస్తుండటం విశేషం.

Go Back to Shorts
Vaishnav Tej
Sreeleela
Adikeshava

More Telugu News