భోళాశంకర్ నుంచి ఈసారి వీడియో లీక్ చేసిన చిరంజీవి
- మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి భోళాశంకర్
- అప్పుడప్పుడు లీకులు ఇస్తున్న చిరంజీవి
- ఈసారి పాట షూటింగ్ వీడియోను పంచుకున్న మెగాస్టార్
భోళాశంకర్ సినిమాలో సంగీత్ నేపథ్యంలో వచ్చే ఈ పాట చిత్రీకరణ వీడియోను చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న తారాగణం అందరూ ఈ పాటలో ఉండడం విశేషం.
ఈ వీడియో లీక్ చేయడానికి ముందు చిరంజీవి ట్విట్టర్ లో హింట్ ఇచ్చారు. తాను మరోసారి లీక్ చేయబోతున్నానని, నేటి సాయంత్రం 5 గంటలకు ఇన్ స్టాగ్రామ్ లో ఆ లీక్ ఉంటుందని వెల్లడించారు. చెప్పినట్టుగానే ఇన్ స్టాలో సాంగ్ షూట్ వీడియోను పోస్టు చేశారు.
ఇందులో చిరంజీవి, తమన్నా, సుశాంత్, కీర్తి సురేశ్ లతో పాటు ఇతర నటీనటులందరూ కనువిందు చేశారు. ఇక ఈ వీడియో చివర్లో పాటకు సంబంధించిన చిన్న బిట్ ను కూడా పొందుపరిచారు. "జాం జాం జాం జాం జజ్జనక... తెల్లార్లూ ఆడుదాం తైతక్క" అంటూ సాగే ఆ హుషారైన పాటకు చిరు ఎనర్జటిక్ స్టెప్పులు వేసేందుకు రెడీ అవుతుండడం ఈ వీడియోలో చూడొచ్చు.